హైదరాబాద్ (Hyderabad)లో ‘కింగ్డమ్’ (‘Kingdom’) సినిమా విజయోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి చిత్రబృందం అంతా హాజరైంది. అయితే ఈ ఈవెంట్‌లో నిర్మాత నాగవంశీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. కింగ్డమ్ మూవీ నిర్మాత నాగవంశీ (Nagavamsi) మాట్లాడుతూ “తెలంగాణ (Telangana) లో ఘనంగా విజయోత్సవ వేడుక జరిపాం. త్వరలోనే ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో కూడా సక్సెస్ మీట్ చేస్తాం” అని చెప్పారు. అంతే కాక, మీడియా ప్రతినిధులు ఒక ప్రశ్న వేయగా ఆయన ఇచ్చిన రిప్లై హాట్ టాపిక్ అయింది.
కింగ్డమ్ సక్సెస్ మీట్‌లో రిపోర్టర్ “కోస్తా ప్రాంతంలో జరిగే మీట్‌లో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ను ఆహ్వానిస్తారా?” అని అడిగిన ప్రశ్నకు నాగవంశీ ఆసక్తికర సమాధానం ఇచ్చారు: “మా పవన్ కళ్యాణ్ విజయ్ దేవరకొండే” అని చెప్పారు. ఈ ప్రస్తుతం టాలీవుడ్‌లో సంచలనంగా మారింది. అభిమానులు, సినీ ప్రేమికులు ఈ వ్యాఖ్యపై తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తున్నారు.