విజయ్ దేవరకొండ హీరోగా రాహుల్ సంకృత్యాన్ (Rahul Sankrityan) దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా పీరియాడిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా నిర్మించబడింది. రాహుల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో విజయ్ (Vijay Deverakonda) యోధుడిగా కనిపించనుండగా, ఈ చిత్రం కోసం ఇప్పటికే భారీ మేకోవర్‌లో ఉన్నాడు. సినిమాలో ఒక కీలక పాత్రకు స్కోప్ ఉందని, దానిని అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) పోషించే అవకాశం ఉందని సమాచారం.
ఈ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ నటిస్తున్నట్లు తెలుస్తుండటంతో అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. అమితాబ్ పాత్రపై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. విజయ్, అమితాబ్ కాంబినేషన్ నిజమైతే, టాలీవుడ్‌లో ఇది సెన్సేషన్ సృష్టించడం ఖాయం.
ఇటీవల విడుదల కల్కీ సినిమా క్లైమాక్స్‌లో అమితాబ్, విజయ్‌దేవరకొండ స్క్రీన్ షేర్ చేసుకున్న విషయం తెలిసిందే. అయితే రాహుల్ దర్శకత్వంలోని తెరకెక్కే సినిమాలో వీరి స్క్రీన్ షేర్ ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది.