విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా నటించిన ‘కింగ్‌డమ్’ (‘Kingdom’) సినిమా (Movie) మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే పలుసార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమాను ఎట్టకేలకు ఈ నెల 31వ తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. గౌతమ్ తిన్ననూరి (Gautham Tinnanuri) దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సితార నాగవంశీ (Sithara Naga Vamsi) అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించారు.
తాజాగా ఈ సినిమాకు సంబంధించి టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతి ఇస్తూ ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం జీవో (GO) జారీ చేసింది. ఈ జీవో ప్రకారం, ‘కింగ్‌డమ్’ సినిమా టికెట్లను సింగిల్ స్క్రీన్‌లలో జీఎస్టీతో కలిపి రూ. 50, మల్టీప్లెక్స్‌లలో జీఎస్టీతో కలిపి రూ. 75 పెంచి అమ్ముకోవడానికి అవకాశం కల్పించారు.
సినిమా విడుదలైన రోజు నుంచి పది రోజుల పాటు ఈ పెరిగిన టికెట్ రేట్లతో అమ్ముకునే అవకాశం ఉంటుంది. ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే (Bhagyashree Borse) హీరోయిన్‌గా నటించింది. ‘కింగ్‌డమ్’ సినిమాకు సంబంధించి తెలంగాణలో కూడా టికెట్ రేట్స్ హైక్ అడిగే అవకాశం ఉంది.
విజయ్ దేవరకొండ కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూ. 130 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందింది. ఇప్పటికే ఓటీటీ రైట్స్ ద్వారా రూ. 50 కోట్లు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.