టాలీవుడ్ (Tollywood) యువ సంచలనం విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ప్రయాణిస్తున్న కారు(Car)కు తాజాగా స్వల్ప ప్రమాదం జరిగింది. జోగుళాంబ గద్వాల జిల్లా (Jogulamba Gadwal District), ఉండవల్లి (Undavalli) మండలం సమీపంలో 44వ జాతీయ రహదారిపై ఈ సంఘటన చోటుచేసుకుంది.
విజయ్ దేవరకొండ తన మేనేజర్, డ్రైవర్‌తో కలిసి పుట్టపర్తి (Puttaparthi)లోని సత్యసాయి (Sathya Sai) సమాధిని(Tomb) దర్శించుకుని తిరిగి హైదరాబాద్ వస్తుండగా, ముందు వెళ్తున్న బస్సు సడన్ బ్రేక్ వేయడంతో వారి కారు బొలెరో వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు స్వల్పంగా దెబ్బతిన్నప్పటికీ, హీరో విజయ్ దేవరకొండతో సహా కారులో ఉన్న ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఇటీవల రష్మిక మందన్నా, విజయ్ దేవరకొండల నిశ్చితార్థం వార్తలు వస్తున్న వేళ ఈ ప్రమాదం జరగడం గమనార్హం.
విజయ్ దేవరకొండ స్పందన:
ప్రమాదంపై ఆందోళన చెందిన అభిమానుల కోసం విజయ్ దేవరకొండ స్వయంగా సోషల్ మీడియాలో స్పందించారు. “అంతా బాగానే ఉంది. కారు డ్యామేజ్ అయ్యింది.. కానీ, మేమంతా క్షేమంగా ఉన్నాం,” అని తెలిపారు. ప్రమాదం తర్వాత తాను వర్కౌట్ చేసి ఇంటికి చేరుకున్నానని, స్వల్ప తలనొప్పిగా ఉందని, ఒక బిర్యానీ తిని నిద్రపోతే సరిపోతుందని అభిమానులకు ధైర్యం చెప్పారు.
విజయ్ దేవరకొండ క్షేమంగా ఉన్నట్లు ప్రకటించడంతో ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. డ్రైవర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.







