పొలిటికల్‌ ఎంట్రీపై విజయ్ ఆంటోనీ స్పందన

పొలిటికల్‌ ఎంట్రీపై విజయ్ ఆంటోనీ స్పందన

తన తాజా చిత్రం ‘మార్గన్’ (Morgan) ప్రమోషన్స్‌ (Promotions)లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో నటుడు విజయ్ ఆంటోనీ (Vijay Antony) తన రాజకీయ ప్రవేశంపై (Political Entry) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలపై తనకు పెద్దగా అవగాహన లేదని, కేవలం ఫేమ్ ఉందని రాజకీయాల్లోకి రాలేమని స్పష్టం చేశారు.

రాజకీయ ప్రవేశంపై విజయ్ ఆంటోనీ అభిప్రాయం
“రాజకీయాల్లోకి అడుగుపెట్టాలనే ఉద్దేశం నాకు లేదు. నటీనటులు ఏదో ఒక సమయంలో తప్పకుండా రాజకీయాల్లోకి రావాలనే నిబంధన ఏమీ లేదు కదా. సేవ చేయాలనే ఉద్దేశంతో ఎవరైనా అడుగుపెట్టినా, వారికి ప్రజల పూర్తి మద్దతు ఉండాలి. అలా ఉన్నప్పుడే వారు అధికారంలోకి రాగలరు. నిజం చెప్పాలంటే, నాకు రాజకీయాలపై పెద్దగా అవగాహన లేదు. ఫేమ్ ఉందని రాజకీయాల్లోకి అడుగుపెట్టడానికి లేదు. ముందు ప్రజల సమస్యలను అర్థం చేసుకోగలగాలి” అని విజయ్ ఆంటోనీ అన్నారు.

డ్రగ్స్ కేసుపై స్పందన
మాదక ద్రవ్యాల కేసులో నటుడు శ్రీకాంత్ అరెస్ట్ కావడం పైనా విజయ్ ఆంటోనీ మాట్లాడారు. సినీ పరిశ్రమలో డ్రగ్స్ వాడకం కొత్తేమీ కాదన్నారు. ఎంతో కాలంగా చిత్ర పరిశ్రమలో ఈ సమస్య ఉందని ఆయన ఆరోపించారు. మత్తు పదార్థాలకు చాలా మంది బానిసలవుతున్నారని తెలిపారు. శ్రీకాంత్‌కు సంబంధించిన కేసు దర్యాప్తులో ఉందని, దీనిలో నిజానిజాలు త్వరలోనే బహిర్గతమవుతాయని పేర్కొన్నారు.

‘మార్గన్’ విశేషాలు
విజయ్ ఆంటోనీ నటించిన తాజా చిత్రం ‘మార్గన్’ (Maargan). లియో జాన్‌పాల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాతో విజయ్ మేనల్లుడు అజయ్ ధీషన్ ప్రతినాయకుడిగా పరిచయమవుతున్నారు. మర్డర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంలో సముద్రఖని, దీప్షిక తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా జూన్ 27న విడుదల కానుంది.

Join WhatsApp

Join Now

Leave a Comment