విజయ్ సేతుపతి కీలక పాత్రలో వెట్రిమారన్ దర్శకత్వం వహించిన ‘విడుదల పార్ట్-2’ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. థియేటర్లలో విడుదల పార్ట్-1 స్థాయిలో విజయాన్ని ఈ చిత్రం అందుకోకపోయినప్పటికీ, అందరిలో ఆసక్తి కలిగించింది. ప్రస్తుతం చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో జనవరి 19వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకులకు అందుబాటులో ఉండనుంది. వెట్రిమారన్ దర్శక ప్రతిభతో పాటు విజయ్ సేతుపతి పాత్రలోని వైవిధ్యాన్ని ఆస్వాదించేందుకు సినిమా ప్రేమికులు ఎదురు చూస్తున్నారు.
ఓటీటీలో ‘విడుదల పార్ట్-2’.. స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడంటే?








