భ‌క్తి ప్ర‌ద‌ర్శించిన గ‌రుడ ప‌క్షి

భ‌క్తి ప్ర‌ద‌ర్శించిన గ‌రుడ ప‌క్షి

ఒడిశా (Odisha) పూరీ (Puri) లోని ప‌విత్ర‌ జగన్నాథ స్వామి ఆలయం (Jagannath Swamy Temple)లో అనిర్వచనీయమైన దృశ్యం చోటు చేసుకుంది. ఆలయ గోపురం (Temple Tower)పై ఎగురుతున్న జెండాలలో ఒకటి గరుడపక్షి (Eagle) (గద్ద) కాలికి తగిలి, అది శ్రీ‌మందిరం (Sri Mandir) చుట్టూ ప్రదక్షిణం (Circumambulation) చేసినట్టు తెలుస్తోంది. ఈ సంఘటనను ప్రత్యక్షంగా చూసిన భక్తులు ఆశ్చర్యంతో అబ్బురపడ్డారు.

ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పలువురు దీనిని దివ్య సంకేతం (Divine Sign) గా భావిస్తుండగా, మరికొందరు మాత్రం అది ఆలయ జెండా (Temple Flag) కాకపోవచ్చని, కేవలం ఒక వస్త్రం అయ్యి ఉండొచ్చని వ్యాఖ్యానిస్తున్నారు. అది గరుడ పక్షేనా? నిజంగా జెండా తగిలిందా? అన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు కానీ, వీడియో మాత్రం నెటిజన్లను విశేషంగా ఆకర్షిస్తోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment