మాజీ మంత్రి విడదల రజిని (Vidadala Rajini) మరిది విడదల గోపినాథ్ (Vidadala Gopinath) అరెస్ట్ (Arrest) అయ్యారు. గురువారం ఉదయం హైదరాబాద్ (Hyderabad) లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలి (Financial District, Gachibowli)లో గోపినాథ్‌ను ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ చేసిన అనంతరం గోపినాథ్‌ను ఏపీకి తరలిస్తున్నారు.
స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించిన కేసు
ఓ స్టోన్ క్రషర్ (Stone Crusher) యజమానిని బెదిరించి డబ్బులు వసూలు చేశారన్న అభియోగంతో అరెస్ట్ చేసినట్లుగా సమాచారం. గత నెల మాజీ మంత్రి విడదల రజిని మీద కూడా ఇదే విషయంలో కేసు నమోదు చేశారు. 2020లో పల్నాడు (Palnadu) జిల్లా యడ్లపాడు (Yadlapadu)లోని శ్రీలక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ (Sri Lakshmi Balaji Stone Crusher) యజమానిని విజిలెన్స్ తనిఖీల పేరుతో బెదిరించి డబ్బులు వసూలు చేసినట్టు అధికార పార్టీ నేతలు ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే.
కూటమి అధికారంలోకి వచ్చాక తమ కుటుంబాన్ని కేసులతో వేధిస్తోందని, ఎన్ని కేసులు పెట్టినా, ఎంత వేధించినా భయపడేది లేదని, న్యాయపోరాటం చేస్తానని గతంలో విడదల రజిని ప్రెస్‌మీట్ పెట్టి మరీ చెప్పిన విషయం తెలిసిందే.