దేశ ఉపరాష్ట్రపతి (Vice President) సీపీ రాధాకృష్ణన్ (C.P.Radhakrishnan) కుటుంబ సమేతంగా విజయవాడ (Vijayawada) శ్రీకనకదుర్గ (Sri Kanaka Durga) అమ్మవారిని దర్శించుకున్నారు. దుర్గమ్మ ఆలయానికి చేరుకున్న ఉపరాష్ట్రపతికి అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని దర్శించుకున్న ఆయన ప్రత్యేక పూజలు చేశారు. దర్శనానంతరం రాష్ట్ర ప్రజలందరికీ దసరా (Dasara) నవరాత్రుల (Navaratri) శుభాకాంక్షలు తెలిపారు.
“అమ్మవారిని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. అందరికీ ఆయురారోగ్యాలు కలగాలని, అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకున్నాను. అలాగే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి, విజయవాడ మరింత అభివృద్ధి సాధించాలి” అని ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ అన్నారు.
ఉప రాష్ట్రపతి ఇవాళ, రేపు ఏపీలో పర్యటన కొనసాగించనున్నారు. తొలుత గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్‌కు గవర్నర్, సీఎం చంద్రబాబు, మంత్రులు, ఎంపీలు కలిసి స్వాగతం పలికారు. పోలీసుల గౌరవ వందనం అందుకున్నారు.








