ప్రముఖ నటుడు రవి కుమార్ కన్నుమూత

ప్రముఖ నటుడు రవి కుమార్ కన్నుమూత

ప్రముఖ మలయాళ (Malayalam) నటుడు రవి కుమార్ (Ravi Kumar) (71) కన్నుమూశారు (Passed Away). కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నై(Chennai) లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 1968లో సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన రవి కుమార్ 150కుపైగా మలయాళ, తమిళ చిత్రాల్లో నటించడంతో పాటు అనేక టీవీ సీరియళ్లలో కూడా కనిపించారు. ‘అనుబంధం’ సీరియల్తో ప్రేక్షకులను మెప్పించిన ఆయన, రజినీకాంత్ ‘శివాజీ (‘Sivaji’)’ సినిమాలో మినిస్టర్ పాత్రతో తెలుగువారికీ గుర్తింపు పొందారు. అతని మృతిపై సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేకంగా, నటి రాధికా శరత్‌కుమార్ ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment