వెంకీ అట్లూరి – సూర్య కాంబోలో కొత్త సినిమా

వెంకీ అట్లూరి – సూర్య కాంబోలో కొత్త సినిమా

టాలీవుడ్‌లో నేచురల్ కంటెంట్‌కు గుర్తింపు పొందిన దర్శకుడు వెంకీ అట్లూరి (Venky Atluri), కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) కలయికలో ఓ క్రేజీ ప్రాజెక్ట్ (Crazy Project) ప్రారంభమైంది. ఈరోజు హైదరాబాద్‌ (Hyderabad) లోని రామానాయుడు స్టూడియోలో (Rama Naidu Studio) పూజా కార్యక్రమాలతో సినిమాను అధికారికంగా లాంచ్ చేశారు. ఈ తమిళం-తెలుగు ద్విభాషా చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ (Sithara Entertainments) బ్యానర్‌పై సూర్యదేవర నాగ వంశీ, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఈరోజు ఉదయం జరిగిన పూజా కార్యక్రమంలో దర్శకుడు వెంకీ అట్లూరి, హీరో సూర్యతో పాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. ప్రముఖ రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ కార్యక్రమంలో ముహూర్తం షాట్‌కు క్లాప్ కొట్టారు. ఈ చిత్రంలో సూర్య సరసన మలయాళ నటి మమిత బైజు హీరోయిన్‌గా నటిస్తుండగా, బాలీవుడ్ నటి రవీనా టాండన్, సీనియర్ నటి రాధిక శరత్‌కుమార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

వెంకీ-సూర్య కాంబినేష‌న్‌లో వ‌స్తున్న‌ ఈ చిత్రం సూర్య కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలువ‌నుంద‌ని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వెంకీ అట్లూరి గతంలో “తొలి ప్రేమ, మిస్టర్ మజ్ను” వంటి సినిమాలతో సహజమైన కథాంశాలను అందించడంలో పేరు పొందారు. ఈ కాంబినేషన్ అభిమానుల్లో భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. సూర్య ఈ సినిమా కోసం 60 రోజుల కంటిన్యూస్ షెడ్యూల్‌ను కేటాయించినట్లు సమాచారం. ఎక్స్‌లో అభిమానులు, “సూర్య – వెంకీ అట్లూరి కాంబో సూపర్ హిట్ అవుతుంది” అని ఉత్సాహంగా పోస్ట్‌లు చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment