వెంకటేష్‌-త్రివిక్రమ్ సినిమా: వెంకీ సరసన శ్రీనిధి శెట్టి?

వెంకటేష్‌-త్రివిక్రమ్ సినిమా: వెంకీ సరసన శ్రీనిధి శెట్టి?

వెంకటేష్‌ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న కల నెరవేరబోతోంది. ఇటీవల ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో ఘన విజయం సాధించిన వెంకటేష్‌, ఇప్పుడు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌తో కలిసి ఒక కొత్త ప్రాజెక్ట్‌ను ప్రారంభించబోతున్నారు. గతంలో ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాలకు త్రివిక్రమ్ మాటలు రాసిన విషయం తెలిసిందే. ఈసారి పూర్తి స్థాయి దర్శకుడిగా వెంకటేష్‌ను డైరెక్ట్ చేయనున్నారు.

ఈ సినిమా ఒక పూర్తి స్థాయి కుటుంబ కథా చిత్రం అని, త్రివిక్రమ్ మార్క్ కామెడీ, పంచ్‌లతో ప్రేక్షకులను అలరించడం ఖాయమని తెలుస్తోంది.

శ్రీనిధి శెట్టి ఫిక్స్?
ఈ సినిమా కోసం హీరోయిన్‌గా ఎవరిని ఎంపిక చేస్తారనే చర్చ చాలా రోజులుగా నడుస్తోంది. మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్, నేహా శెట్టి లాంటి హీరోయిన్ల పేర్లు వినిపించాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం, కన్నడ నటి శ్రీనిధి శెట్టిని హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

ఈ సినిమాను హారిక హాసిని క్రియేషన్స్‌ బ్యానర్‌పై సూర్యదేవర చినబాబు నిర్మిస్తున్నారు. సినిమాకు ‘వెంకట రమణ C/O ఆనంద నిలయం’ మరియు ‘అలివేలు వెంకటరత్నం’ అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఈ నెల చివరి వారంలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. సంగీతం త్రివిక్రమ్ ఆస్థాన సంగీత దర్శకుడు తమన్ అందించనున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment