వెంక‌టేష్ నాయుడు టీడీపీ మ‌నిషేనా..? ఇవిగో ఆధారాలు

వెంక‌టేష్ నాయుడు టీడీపీ మ‌నిషే..? ఇదిగో ఆధారాలు

ఏపీ (AP)లో లిక్క‌ర్ కేసు (Liquor Case) రోజుకో కొత్త మ‌లుపు తిరుగుతూ సంచ‌ల‌నంగా మారుతోంది. గ‌త వారం రోజులుగా రూ.11 కోట్ల విష‌యంలో సిట్(SIT) అధికారులు, రాజ్ కేసిరెడ్డి (Raj Kesireddy) త‌ర‌ఫు లాయ‌ర్ల (Lawyers) మ‌ధ్య ఆస‌క్తిక‌ర వాద‌న‌లు కొన‌సాగుతుండ‌గా, తాజాగా వెంక‌టేష్ నాయుడు వీడియోలు తెరపైకి వ‌చ్చాయి. వెంక‌టేష్ నాయుడు (Venkatesh Naidu) చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి (Chevireddy Bhaskar Reddy) ప్ర‌ధాన అనుచ‌రుడు అని సిట్ అధికారులు ఒక వీడియో విడుద‌ల చేయ‌గా, వెంక‌టేష్ నాయుడు తెలుగుదేశం పార్టీ (TDP)కి చెందిన వ్య‌క్తేన‌ని వైసీపీ(YSRCP) ఆరోపిస్తోంది. చంద్ర‌బాబు, లోకేష్‌(Lokesh)తో ప‌లుమార్లు దిగిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

2024 ఎన్నిక‌ల్లో లిక్క‌ర్ డ‌బ్బు పంచార‌ని వెంక‌టేష్ నాయుడు వీడియో సారాంశం. అయితే, అందులో 2023 సెప్టెంబ‌ర్‌లో ర‌ద్దు అయిన రూ.2 వేల నోట్లు కూడా ద‌ర్శ‌న‌మివ్వ‌డంతో కొత్త అనుమానాలు రేకెత్తాయి. ర‌ద్ద‌యిన నోట్లు 2024 ఎన్నిక‌ల్లో ఎలా పంచుతార‌నేది పెద్ద ప్ర‌శ్న‌. అయితే ఇది ఏఐ వీడియో అని కొంత‌మంది లాజిక్ తీస్తుండ‌గా, ర‌ద్దు అయిన నోట్ల‌ను పంచితే తీసుకునేంత అమాయ‌కులా జ‌నాలు అని ఇంకొంద‌రు వాదిస్తున్నారు. మ‌రికొంద‌రు మాత్రం ఎవ‌రీ వెంక‌టేష్ నాయుడు అని ఆరా తీస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో లిక్కర్ కేసులో నిందితుడు వెంకటేష్ నాయుడు టీడీపీ మనిషే అని స్ప‌ష్టమైన ఆధారాలు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. సంచలన ఫోటోలు(Photos) వెలుగులోకి వ‌స్తున్నాయి. సీఎం(CM) చంద్రబాబు (Chandrababu), మంత్రి లోకేష్‌ల‌తో స‌న్నిహితంగా వెంకటేష్ నాయుడు ప‌లుమార్లు దిగిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. సీఎం చంద్రబాబుతో ఉన్న ఫోటోలు బయటపడటంతో బండారం బట్టబయలు అయ్యిందంటూ నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు. అదే విధంగా ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడు (Venkaiah Naidu), టీడీపీ కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు (Kinjarapu Rammohan Naidu), పెమ్మసాని చంద్రశేఖర్‌లతో వెంక‌టేష్ నాయుడు ఫొటోలు సోష‌ల్ మీడియాలో షికార్లు చేస్తున్నాయి.

వెంక‌టేష్ నాయుడు వైసీపీ మ‌నిషే అని చిత్రీక‌రించాల‌న్న తెలుగుదేశం పార్టీ ప‌న్నాగం బెడిసికొట్టింనంద‌ని, తెలుగుదేశం, ఆ పార్టీ అనుకూల మీడియా చేసిన హ‌డావుడి బ‌య‌ట‌ప‌డింద‌ని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు. మొద‌ట ఏఐ వీడియోతో దొరికిపోయిన అధికార పార్టీ, తాజా ఫొటోల‌తో వెంక‌టేష్ నాయుడు టీడీపీ మ‌నిషే అని రూడీ అయ్యింద‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు. నోట్ల కట్టలు వీడియో సృష్టించి బురద చల్లింద‌ని, వెంకటేష్ నాయుడు టీడీపీ వ్యక్తని తేలడంతో అడ్డంగా బుక్కైన ఎల్లో మీడియా అంటూ వైసీపీ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment