ఢిల్లీ కాలేజీకి వీర్ సావర్కర్ పేరు.. కాంగ్రెస్ అభ్యంత‌రం!

ఢిల్లీ కాలేజీకి వీర్ సావర్కర్ పేరు.. కాంగ్రెస్ అభ్యంత‌రం!

ఢిల్లీలో నజాఫ్‌గఢ్‌లో రూ.140 కోట్ల వ్యయంతో కొత్త కాలేజీ నిర్మాణానికి శంకుస్థాపనకు సిద్ధమవుతున్న నేపథ్యంలో, కాలేజీకి వీర్ సావర్కర్ పేరు పెట్టాలన్న‌ బీజేపీ నిర్ణయాన్ని కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయబోతున్నారు. ఈ సందర్భంగా రూ.140 కోట్ల‌తో నిర్మించ‌నున్న కాలేజీకి వీర్ సావ‌ర్క‌ర్ పేరు పెట్టాల‌ని బీజేపీ నిర్ణ‌యం తీసుకుంది. దీంతో కాంగ్రెస్ పార్టీ దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేరు పెట్టాలని సూచించింది. కాంగ్రెస్ నేతలు సావర్కర్‌ను విమర్శిస్తూ, ఆయన బ్రిటీష్ వారి నుంచి క్షమాపణలు కోరిన సంగతి గుర్తుచేశారు. విద్యారంగానికి ఎనలేని సేవలందించిన మన్మోహన్ పేరుని కాలేజీకి పెట్టాలని డిమాండ్ చేశారు.

BJP ప్రతిస్పందన..
బీజేపీ నేతలు ఈ వివాదంపై కాంగ్రెస్ వ్యాఖ్య‌ల‌ను ఆక్షేపిస్తూ, ఇది అనవసర రాజకీయమని విమర్శించారు. ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్‌దేవా మాట్లాడుతూ.. కాంగ్రెస్ స్వాతంత్ర్య సమరయోధులను గౌరవించలేదని ఆరోపించారు. వీర్ సావర్కర్ పేరు కాలేజీకి పెట్టడం గర్వకారణమని చెప్పారు.

Join WhatsApp

Join Now

Leave a Comment