మెగా ఫ్యామిలీ (Mega Family) కాంపౌండ్ నుంచి మరో శుభవార్త బయటకు వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) తండ్రి (Father) కాబోతున్నట్టు స్వయంగా వెల్లడించారు. ఈ విషయాన్ని ప్రకటిస్తూ తన సోషల్ మీడియా ఖాతాలో ఓ క్యూట్ ఫొటో (Cute Photo)ను షేర్ (Shared) చేసి అభిమానులకు గుడ్ న్యూస్ (Good News) చెప్పారు వరుణ్ తేజ్. వివాహం జరిగిన కొద్ది నెలలకే వస్తున్న ఈ శుభవార్తతో మెగా ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు వరుణ్ తేజ్ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
మెగా హీరో వరుణ్ తేజ్, నటి లావణ్య త్రిపాఠి దంపతుల గురించి ఈ ఆసక్తికర వార్త గత నాలుగు రోజుల క్రితమే సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. ఆ వార్త నిజమేనని సెలబ్రిటీ దంపతులు కన్ఫార్మ్ చేశారు. చాలాకాలం గుట్టుగా ప్రేమించుకున్న ఈ జంట ఇరు కుటుంబాల అంగీకరాంతో 2023లో పెళ్లి చేసుకున్నారు. త్వరలో వరుణ్-లావణ్య (Varun–Lavanya) మొదటి బిడ్డను ఆహ్వానించనున్నారు. శుభవార్త చెప్పిన వరుణ్ దంపతులకు మెగా ఫ్యాన్స్, సెలబ్రిటీల నుంచి శుభాకాంక్షలు (Congratulations) వెల్లువెత్తుతున్నాయి.