---Advertisement---

సమంత ‘సిటాడెల్’కు షాక్.. అవార్డ్ మిస్‌

సమంత ‘సిటాడెల్'కు షాక్.. అవార్డ్ మిస్‌
---Advertisement---

హీరోయిన్ సమంత, బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్ ప్రధాన పాత్రల్లో రాజ్ మ‌రియు డీకే దర్శకత్వంలో రూపొందిన ‘సిటాడెల్’ వెబ్‌సిరీస్ అంతర్జాతీయంగా గుర్తింపు పొందినా, అవార్డు రేసులో వెనుకబడింది. సినీ ఇండస్ట్రీ అత్యంత ప్రతిష్టాత్మకమైన క్రిటిక్స్‌ ఛాయిస్‌ అవార్డులను ప్రకటించారు. ఈ అవార్డుల కోసం సిటాడెల్ ఇండియన్ వర్షన్ హనీ బన్నీ వెబ్ సిరీస్‌, మ‌ల‌యాళ చిత్రం ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ మూవీ కూడా ఈ అవార్డుకు పోటీపడ్డాయి. బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్‌ వెబ్‌ సిరీస్‌ల జాబితాలో నామినేట్ అయిన స‌మంత న‌టించిన హనీ బన్నీ అవార్డ్‌ను సాధించలేకపోయింది.

బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్‌ వెబ్‌ సిరీస్ కేట‌గిరీలో కొరియన్ వెబ్ సిరీస్ స్క్విడ్‌ గేమ్-2 అవార్డ్‌ను దక్కించుకుంది. గతేడాది నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఈ సిరీస్‌ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణ దక్కించుకుంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment