‘వారణాసి’లోకి పవర్‌ఫుల్ నటుడు ఎంట్రీ !

‘వారణాసి’లో పవర్‌ఫుల్ నటుడు ఎంట్రీ !

టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) మరియు దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి (S.S. Rajamouli) కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ ప్రాజెక్ట్ ‘వారణాసి’ (Varanasi) ప్రస్తుతం షూటింగ్‌ జరుపుకుంటోంది. ఈ సినిమా ద్వారా మహేష్, రాజమౌళి ఇద్దరూ గ్లోబల్‌ స్థాయిలో తమ సత్తాను చాటబోతున్నారు. ఇప్పటికే టైటిల్ అనౌన్స్‌మెంట్ ఈవెంట్‌ లో రాజమౌళి వ్యాఖ్యలు కాంట్రవర్సీగా మారిన విషయం తెలిసిందే. దీంతో ఈ ప్రాజెక్ట్ నుంచి వచ్చే ప్రతి చిన్న సమాచారం కూడా అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది.

తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాలో ఒక పవర్‌ఫుల్ మరియు విలక్షణ నటుడు జాయిన్‌ కాబోతున్నాడట. తన ప్రత్యేక మైన నటన, డైలాగ్ డెలివరీతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రకాశ్ రాజ్ (Prakash Raj) ఈ సినిమాలో కీలక పాత్రలో నటించనున్నారంటూ సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి. ఎలాంటి పాత్రను కూడా అత్యంత నైపుణ్యంగా చేసే ప్రకాశ్ రాజ్ కోసం రాజమౌళి ఎలాంటి రోల్ వ్రాశారో అనేది ఇప్పుడు ప్రేక్షకులలో ఆసక్తిని పెంచుతోంది.

ఇప్పటివరకు మేకర్స్ నుండి ఈ వార్తపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ప్రకాశ్ రాజ్ నిజంగా ఈ సినిమాలో ఉంటాడా అనే విషయం ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఇందులో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నట్లు సమాచారం. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని కె.ఎల్. నారాయణ నిర్మిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment