‘వారణాసి’లో హోర్డింగ్స్‌.. రిలీజ్ డేట్ అనౌన్స్‌!!

'వారణాసి'లో హోర్డింగ్స్‌.. రిలీజ్ డేట్ అనౌన్స్‌!!

సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్ట‌ర్ ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ బ‌డ్జెట్ సినిమా ‘వారణాసి’పై ప్రేక్షకుల్లో అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటికే రెండు నెలల క్రితం టైటిల్ అనౌన్స్ కావడంతో దేశవ్యాప్తంగా భారీ బజ్ ఏర్పడింది. షూటింగ్ ఇంకా కొనసాగుతున్నప్పటికీ, సినిమా రిలీజ్ డేట్‌పై ఇప్పటి నుంచే చర్చ మొదలవడం సంచ‌ల‌నంగా మారింది.

ఈ నేపథ్యంలో తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ ఘటన సినిమాపై హైప్‌ను మరింత పెంచింది. వారణాసి పట్టణంలో భారీ హోర్డింగ్స్ ప్రత్యక్షమవడం ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. జనసంచారం ఎక్కువగా ఉండే ప్రధాన ప్రాంతాల్లో ఒక్కసారిగా వెలిసిన ఈ హోర్డింగ్స్‌లో సినిమా పేరు, నటీనటుల వివరాలు లేకుండా కేవలం “2027 ఏప్రిల్ 7న థియేటర్లలో” అనే ఒక్క లైన్ మాత్రమే కనిపించడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

ఈ హోర్డింగ్స్ ఫోటోలు వైరల్ కావడంతో ఇది మహేష్ బాబు – రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘వారణాసి’ రిలీజ్ డేట్ ఇదేనని సోషల్ మీడియాలో ఊహాగానాలు జోరందుకున్నాయి. ఇదిలా ఉండగా, కొంతమంది నెటిజన్లు ఇది అధికారిక ప్రమోషన్ కాకుండా ఫ్యాన్స్ చేసిన పనై ఉండొచ్చని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రిలీజ్ డేట్‌పై ముందుగానే బజ్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో అభిమానులే ఈ హోర్డింగ్స్ ఏర్పాటు చేసి ఉండొచ్చని చర్చ జరుగుతోంది.

అయితే ఒకేసారి నగరమంతా ఇంత పెద్ద స్కేల్‌లో హోర్డింగ్స్ వేయడం అభిమానులకు సాధ్యమేనా? అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇప్పటి వరకు ఈ హోర్డింగ్స్‌పై చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక స్పందన రాకపోవడంతో సస్పెన్స్ మరింత పెరిగింది. మేకర్స్ కావాలనే మౌనం పాటిస్తున్నారా? లేక ఇది నిజంగానే అనధికారిక వ్యవహారమా? అన్నది తెలియాల్సి ఉంది.

ఏదేమైనా, అధికారిక ప్రకటన లేకుండానే ‘వారణాసి’ సినిమా రిలీజ్ డేట్‌పై చర్చ జరగడం, రాజమౌళి మార్క్ హైప్‌కు మరో ఉదాహరణగా ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పుడు అందరి చూపు మాత్రం మేకర్స్ నుంచి వచ్చే క్లారిటీపై నిలిచింది.

Join WhatsApp

Join Now

Leave a Comment