ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) లోని వారణాసి (Varanasi) లో దారుణమైన ఘటన జరిగింది. 19 ఏళ్ల యువతిని (Young Woman) కిడ్నాప్ (Kidnap) చేసి 6 రోజుల పాటు హోటళ్లు, హుక్కా బార్లకు తీసుకెళ్లి 23 మంది అఘాయిత్యానికి (Sexual Assault) పాల్పడ్డారు. తనకు జరిగిన దారుణంపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సంఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది.
ఈ విషయంపై ప్రధాని నరేంద్ర మోదీ ( (Prime Minister Narendra Modi) తీవ్రంగా స్పందించారు. వారణాసిలో ల్యాండ్ అయిన వెంటనే, పోలీసులతో పాటు కలెక్టరును సంప్రదించి బాధితురాలికి న్యాయం చేయాలంటూ సూచించారు. నిందితులపై కఠిన చర్యలు (Strict Action) తీసుకోవాలని స్పష్టంగా ఆదేశించారు. ప్రస్తుతం పోలీసులు కేసును దర్యాప్తు (Investigation) చేస్తున్నారు. బాధితురాలి వాంగ్మూలం (Victim’s Statement) ఆధారంగా నిందితులను గుర్తించి అరెస్టు చేసే ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది.