ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) పార్లమెంట్‌లో ‘వందేమాతరం’ (“Vande Mataram”) 150వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక చర్చ ప్రారంభించారు. ఆయన వందేమాతరం కేవలం పాట(Song) కాదని, భారత దిక్సూచి (India’s Guiding Principle), స్వాతంత్య్ర ఉద్యమానికి స్ఫూర్తి ఇచ్చిన యుద్ధ నినాదం అని అన్నారు.
బ్రిటిష్ పాలనలో బంకిం చంద్ర చటోపాధ్యాయ రాసిన ఈ గీతం 1905లో బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమంలో ప్రజలను ఏకతాటిపైకి తెచ్చిందని ప్రధాని గుర్తు చేశారు. వందేమాతరం భారతదేశ స్వాతంత్ర్యం, సాధికారతకు సంబంధించిన ఘట్టాలను ప్రతిబింబించిందని, భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిస్తుందనూ పేర్కొన్నారు.
పార్లమెంట్ (Parliament)లో వందేమాతరం గురించి 10 గంటల చర్చకు కేటాయించబడింది. ప్రధాని మోడీ తర్వాత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, గౌరవ్ గొగోయ్, ప్రియాంకా గాంధీ సహా ఇతర ఎంపీలు ప్రసంగించనున్నారు. వందేమాతరం 1875లో బంగదర్శన్‌లో ప్రచురించబడింది, 1950లో జాతీయ గీతంగా పరిగణించబడింది. కేంద్ర ప్రభుత్వం ఈ పాట 150వ వార్షికోత్సవాన్ని నిర్వహిస్తూ, ఏడాది పొడవునా వార్షికోత్సవాలను జరుపేలా నిర్ణయించింది.








