ఉత్తరాఖండ్(Uttarakhand)లో ప్రకృతి తన ఉగ్రరూపాన్ని(Natural Disaster) ప్రదర్శించింది. భారీ వర్షాలు, హిమపాతం (Snowfall) కారణంగా చమోలి జిల్లాలో 57 మంది కార్మికులు మంచుకింద సమాధయ్యారు. ఇప్పటి వరకు 10 మంది సురక్షితంగా బయటపడగా, వారిని ఆర్మీ ఆస్పత్రికి తరలించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
ఈ ప్రమాద స్థలంలో ఎస్టీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, ఐటీబీపీ, బీఆర్ఓ బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నాయి. భారత వాతావరణ శాఖ ఉత్తరాఖండ్‌తో పాటు కొండ ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. శుక్రవారం అర్ధరాత్రి వరకు భారీ వర్షాలు కురుస్తాయని ఉత్తరాఖండ్ ప్రజలను హెచ్చరించింది.
వర్షాలు, మంచు దాడితో జనజీవనం అస్తవ్యస్తంగా మారాయి. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. పట్టణాల్లో అండర్‌పాస్‌లు మూసివేయడంతో ట్రాఫిక్ జామ్ ఉత్పన్నమైంది. హిమాచల్‌ప్రదేశ్‌లో కూడా కుండపోత వర్షాలు, హిమపాతం తీవ్ర ఇబ్బందులకు కారణమయ్యాయి. 200 రహదారులు మూసివేయగా, ఇప్పటి వరకు 5 మంది మృతి చెందినట్లు సమాచారం.