బురద మడిలోకి దిగి.. వరి నాట్లు వేసిన ముఖ్యమంత్రి

బురద మడిలోకి దిగి.. వరి నాట్లు వేసిన ముఖ్యమంత్రి

ఉత్తరాఖండ్ (Uttarakhand) ముఖ్యమంత్రి (Chief Minister) పుష్కర్ సింగ్ ధామి (Pushkar Singh Dhami) నేడు రైతు (Farmer) అవతారం ఎత్తి అందరినీ ఆశ్చర్యపరిచారు. శనివారం, ఖాతీమాలోని నగర తెరాయ్ (Terai) ప్రాంతంలో ఉన్న తన స్వంత పొలంలోకి దిగి, బురద మడిలో స్వయంగా గొర్రు తోలారు. అంతేకాకుండా, కూలీలతో కలిసి వరి నాట్లు (Paddy Fields) కూడా వేశారు.

ఈ సందర్భంగా సీఎం ధామి అక్కడే ఉన్న రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాను వ్యవసాయ కుటుంబం నుంచే వచ్చానని, అందుకే రైతుల కష్టాలు తనకు తెలుసని చెప్పారు. రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటానని భరోసా ఇచ్చారు.

పొలంలో ధామి వ్యవసాయ పనులు చేస్తున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రైతుల కృషి, త్యాగం, అంకితభావానికి ఇది ఒక రకమైన సెల్యూట్ అని ఆయన తన సందేశంలో పేర్కొన్నారు. సీఎం ఈ విధంగా నేరుగా పొలంలోకి దిగి పష్టపడటంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment