గ్రీన్‌లాండ్ ద్వీపంపై ట్రంప్ క‌న్ను.. దూసుకెళ్తున్న అమెరికా సైన్యం!

అమెరికా సైనికులు గ్రీన్‌లాండ్‌ వైపుకు…

గ్రీన్‌లాండ్‌ (Greenland) ప్రపంచంలో అతిపెద్ద ద్వీపం. 2,166,086 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపం (Largest Island). భూభాగం ఎక్కువగా మంచుతో కప్పబడి ఉంటుంది. దాదాపు 80% భూభాగం మంచు కప్పుతో (Ice Sheet) ఉంటుంది. గ్రీన్‌లాండ్‌ అనేక ప్రాకృతిక దృశ్యాల కోసం ప్రసిద్ధి చెందింది. మంచు పర్వతాలు, ఫియార్డులు, నదులు, మరియు సుందరమైన ఆర్క్టిక్ వన్యప్రాణి నివాసాలు. డెన్మార్క్ (Denmark) రాజ్యానికి లోపల స్వయం పాలిత ప్రాంతంగా ఉంది, కానీ ఇది అంతర్జాతీయంగా ప్రధానంగా డెన్మార్క్ భాగంగా ప‌రిగ‌ణిస్తారు.

అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ (Donald Trump) హెచ్చరించినట్లుగానే గ్రీన్‌లాండ్‌లో ఉద్రిక్తతలు మొదలైనట్లు తెలుస్తోంది. అమెరికా సైన్యం గ్రీన్‌లాండ్ దిశగా చర్యలు ప్రారంభించినట్లు సమాచారం. పిటుఫిక్ స్పేస్ బేస్ (Pituffik Space Base) నుంచి అమెరికా సైనికులు (US Soldiers) కార్యకలాపాలు చేపట్టినట్టు, అంతరిక్ష దళానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ చర్యలు ట్రంప్ ఇప్పటికే సూచించిన హెచ్చరికలకు అనుగుణంగా జరుగుతున్నట్టు సమాచారం.

తాజా ఆపరేషన్‌లో 150 మంది యూఎస్ ఎయిర్‌పోర్స్, స్పేస్ ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నట్లు తెలిసింది. నార్త్‌ అమెరికా ఏరోస్పేస్‌ డిఫెన్స్‌ కమాండ్‌ (NORAD) ప్రకారం, త్వరలో సైనిక విమానం పిటుఫిక్‌ స్పేస్ బేస్‌కు చేరనుంది. డెన్మార్క్ సమన్వయంతోనే ఈ కార్యకలాపాలు జరిగాయని, గ్రీన్‌లాండ్ ప్రభుత్వం ముందు నుండి సమాచారం అందుకున్నదని యూఎస్ సైన్యం ప్రకటించింది. అయితే, అమెరికా ప్రకటనపై డెన్మార్క్ అధికారుల ప్రాధాన్యత లేదా వ్యాఖ్యలు ఇంకా వెలువడలేదు.

Join WhatsApp

Join Now

Leave a Comment