అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడికి అత్యంత సన్నిహితుడు, అమెరికా రైట్‌వింగ్ యువజన ఉద్యమానికి నేతృత్వం వహించిన చార్లీ కిర్క్ (Turning Point USA వ్యవస్థాపకుడు) దారుణ హత్యకు గురయ్యాడు. ట్రంప్ సన్నిహితుడి హత్య కేసు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఉటాహ్ వ్యాలీ యూనివర్సిటీలో ప్రసంగిస్తుండగా ఆయన్ని కొందరు దుండగులు కాల్చిచంపారు. గంటల గడిచినా కూడా నిందితుడిని పోలీసులు పట్టుకోలేకపోవడం అగ్రరాజ్య ప్రజల్లో అనుమానాలు రేకెత్తిస్తోంది.

హత్యపై దర్యాప్తు వేగం
ఉటాహ్‌లో జరిగిన ఈ ఘటనపై పోలీసులు ఇద్దరిని విచారించినా వారిని తర్వాత విడుదల చేశారు. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) డైరెక్టర్ కాశ్ పటేల్ మొదట నిందితుడిని పట్టుకున్నామని ప్రకటించినా, అనంతరం అతన్ని విచారణ అనంతరం విడిచిపెట్టినట్లు తెలిపారు. ప్రజల సహకారం కోరుతూ నిందితులను పట్టుకునేందుకు సహకరించాలని FBI పిలుపునిచ్చింది.
ఎలా జరిగింది?
ఉటాహ్ వ్యాలీ యూనివర్సిటీలో “The American Comeback” అనే నినాదంతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రసంగం మొదలుపెట్టిన 20 నిమిషాలకే కాల్పులు జరిగాయి. కిర్క్ ప్రసంగిస్తుండగా అకస్మాత్తుగా కాల్పులు వినిపించాయి. ఘటనకు ముందు, తర్వాత లభించిన వీడియోల్లో కాల్పులు జరగడానికి ముందు ఒక వ్యక్తి Losee సెంటర్ భవనం పైకప్పుపై కదులుతున్నట్లు కనిపించింది. కాల్పులు జరిగిన వెంటనే ఆ వ్యక్తి అక్కడినుంచి పరుగెత్తి వెళ్లినట్లు కూడా వీడియోలో ఉంది.

చార్లీ కిర్క్ ఎవరు?
2012లో Turning Point USA అనే యువజన సంస్థను స్థాపించిన కిర్క్, కాలేజ్ క్యాంపసుల్లో ర్యాలీలకు నేతృత్వం వహిస్తూ కుడి భావజాలానికి యువతను ఆకర్షించారు. ట్రంప్ అధ్యక్ష పదవీకాలంలో ఆయనకు వైట్‌హౌస్‌తో గట్టి అనుబంధం ఉందనే సమాచారం ఉంది. రిపబ్లికన్ వర్గాల్లో ఆయనను అత్యంత చరిష్మాటిక్ లీడర్‌గా భావించేవారు. ప్రస్తుతం అమెరికా అంతా ఈ హత్యపై షాక్‌లో ఉంది. నిందితుడి కోసం పోలీసులు ముమ్మర వేట కొనసాగిస్తున్నారు.

రాజకీయ స్పందనలు
ఈ ఘటనపై అమెరికా రాజకీయ వర్గాలన్నీ తీవ్రంగా స్పందించాయి. రిపబ్లికన్ గవర్నర్ స్పెన్సర్ కాక్స్, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దీనిని “హత్యాయత్నం కాదు, ఇది స్పష్టమైన హత్య” అని అభివర్ణించారు. హత్య తరువాత సమావేశంలో ఒక నిమిషం మౌనం పాటించినా, అనంతరం అది పార్టీల మధ్య వాదోపవాదాలకు దారితీసింది. ట్రంప్ ఆదేశాల మేరకు అమెరికా జాతీయ పతాకాలను ఆదివారం వరకు అర్ధనిమజ్జనంలో ఉంచారు.