అమెరికా (America) లో మరోసారి విమాన ప్రమాదం (Plane Crash) సంభవించి ప్రజల్లో ఆందోళన కలిగించింది. న్యూయార్క్ (New York) లో శనివారం మధ్యాహ్నం చోటు చేసుకున్న ఈ ఘటనలో చిన్న విమానం కూలిపోవడంతో ఒకరు దుర్మరణం చెందారు. మిగతా ప్రయాణికుల పరిస్థితిపై ఇంకా అధికారిక సమాచారం వెల్లడించలేదు.
న్యూయార్క్ రాష్ట్ర రాజధాని అల్బానీ (Albany) కి దక్షిణంగా ఉన్న కోపేక్ (Copake) ప్రాంతంలో, మసాచుసెట్స్ రాష్ట్ర సరిహద్దుకు సమీపంలో, మిత్సుబిషి MU-2B (Mitsubishi MU-2B) అనే విమానం శనివారం మధ్యాహ్నం 12:15 గంటల సమయంలో (GMT ప్రకారం 1615) ఆరంభమై, న్యూయార్క్‌లోని హడ్సన్ సమీపంలోని కొలంబియా కౌంటీ విమానాశ్రయానికి వెళుతోంది. ఈ విమానంలో మొత్తం ఆరుగురు ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది.
విమాన ప్రమాదానికి గల కారణాలను తేల్చేందుకు ప్రస్తుతం అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) మరియు కొలంబియా కౌంటీ షెరీఫ్ కార్యాలయం (Columbia County Sheriff’s Office) ఈ ఘటనపై స్పందించాయి. మరిన్ని వివరాలను జాతీయ రవాణా భద్రతా బోర్డు (NTSB) ఆదివారం వెల్లడించనుంది.