కాంగ్రెస్‌కు తీర‌ని లోటు.. మాజీ ఎమ్మెల్యే కన్నుమూత

కాంగ్రెస్‌కు తీర‌ని లోటు.. మాజీ ఎమ్మెల్యే కన్నుమూత

ఉప్పల్ (Uppal) నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా (MLA) సేవలందించిన బండారి రాజిరెడ్డి (Bandari Rajireddy) (80) గురువారం ఉదయం హైదరాబాద్‌ (Hyderabad) హబ్సిగూడ (Habsiguda)లోని తన నివాసంలో కన్నుమూశారు (Passed Away). కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ప‌రిస్థితి విష‌మించి తెల్ల‌వారుజామున తుదిశ్వాస విడిచారు.

2009లో ఉప్పల్ నుండి కాంగ్రెస్ పార్టీ (Congress Party) తరపున ఎన్నికై, శాసనసభలో ప్రాతినిధ్యం వహించారు. ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడిగా పేరుగాంచిన రాజిరెడ్డి, స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. ఆయన మృతి పట్ల వివిధ రాజకీయ పార్టీల నేతలు, ప్రజాప్రతినిధులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ నివాళులు అర్పిస్తున్నారు. ఉప్ప‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో విషాద ఛాయ‌లు అలుముకున్నాయి. రాజిరెడ్డి మ‌ర‌ణం కాంగ్రెస్ పార్టీకి తీర‌ని లోటు అని స్థానిక నేత‌లు అంటున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment