మెగా కుటుంబ (Mega Family) కోడలు, ప్రముఖ వ్యాపారవేత్త అయిన ఉపాసన కొణిదెలకు (Upasana Konidela) అరుదైన గౌరవం లభించింది. బిజినెస్ టుడే (Business Today) సంస్థ(Organisation) అందించే ప్రతిష్ఠాత్మకమైన ‘మోస్ట్ పవర్‌ఫుల్ ఉమెన్ ఇన్ బిజినెస్’ (Most Powerful Women in Business) పురస్కారాన్ని ఆమె అందుకున్నారు.ఈ విషయాన్ని ఉపాసన స్వయంగా తన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఈ అవార్డు లభించడం తనకు ఎంతో గర్వకారణమని మరియు తనపై మరింత బాధ్యతను గుర్తు చేసిందని ఆమె తెలిపారు.
“ప్రస్తుతం గర్భవతిగా ఉన్న కారణంగా, ప్రయాణం చేయలేని పరిస్థితుల్లో ఉండటం వలన అవార్డు ప్రదాన కార్యక్రమానికి నేరుగా హాజరు కాలేకపోయాను,” అని ఉపాసన వివరించారు.ఈ గుర్తింపు తమ సంస్థకు, తమ బృందానికి మరింత ప్రేరణనిస్తుందని ఆమె పేర్కొన్నారు. మానసికంగా, శారీరకంగా ప్రజల్లో సానుకూల మార్పు తీసుకురావడమే తమ లక్ష్యమని, ఈ అవార్డు రోజూ మరింత మెరుగ్గా పనిచేయడానికి తమను ప్రోత్సహిస్తుందని తన పోస్ట్‌లో తెలియజేశారు.
వ్యాపారవేత్తగా రాణిస్తూనే అపోలో హాస్పిటల్స్ గ్రూప్ (Apollo Hospitals Group) బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తున్న ఉపాసన, వ్యక్తిగత మరియు వృత్తిపరమైన బాధ్యతలను సమతుల్యంగా చూసుకుంటున్నారు. ప్రస్తుతం గర్భవతి కావడంతో ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటూ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. ఆమె కవల పిల్లలకు జన్మనివ్వబోతున్న నేపథ్యంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ, సోషల్ మీడియాలో మాత్రం చురుకుగా ఉంటూ అభిమానులతో టచ్‌లో ఉంటున్నారు.
ఉపాసన షేర్ చేసిన అవార్డు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అభిమానులు, సినీ ప్రముఖులు, నెటిజన్లు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ “గ్రేట్.. ఇన్‌స్పిరేషన్” అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ముఖ్యంగా మెగా అభిమానులు మెగా కోడలికి అభినందనలు తెలియజేస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.








