మెగా ఫ్యామిలీ (Mega Family)లో మరో శుభవార్త! రామ్ చరణ్ (Ram Charan) సతీమణి ఉపాసన కొణిదెల (Upasana Konidela) రెండోసారి గర్భం (Pregnancy) దాల్చారు. ఇటీవలే దీపావళి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో ఉపాసనకు కుటుంబ సభ్యుల సమక్షంలో సీమంతం (Baby Shower) వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు సంబంధించిన వార్తలు బయటకు రావడంతో మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.రామ్ చరణ్, ఉపాసన దంపతులకు 2023 జూన్‌లో మొదటి సంతానంగా పాప ‘క్లీంకార కొణిదెల’ (Klin Kaara Konidela) జన్మించింది.
చిరంజీవి కోరిక నెరవేరుతుందా?
ఉపాసన రెండోసారి ప్రెగ్నెంట్ అనే వార్తతో పాటు, ఇప్పుడు మెగా ఫ్యామిలీలో ఓ ఆసక్తికరమైన చర్చ మొదలైంది. “ఈ సారైనా మెగాస్టార్ చిరంజీవి కోరిక నెరవేరుతుందా? ఆయన కోరుకున్నట్టు మనవడే పుడతాడా?” అని అభిమానులు చర్చించుకుంటున్నారు.
గతంలో చిరంజీవి స్వయంగా తనకు మనవడి కోసం ఎంతగా ఎదురుచూస్తున్నారో తెలిపారు. తన కొడుకు రామ్ చరణ్‌కు (క్లీంకార), అలాగే తన ఇద్దరు కూతుళ్లకు (సుస్మిత, శ్రీజ) కూడా ఆడపిల్లలే కావడంతో, తన ఇల్లంతా ‘లేడీస్ హాస్టల్’లా మారిపోయిందని ఆయన సరదాగా వ్యాఖ్యానించారు. “ఇంట్లో అందరూ ఆడపిల్లలే.. ఒక మనవడిని ఇవ్వరా అని రామ్ చరణ్‌ను అడిగాను,” అని చిరంజీవి చెప్పిన మాటలు ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతున్నాయి. దీంతో, ఉపాసన రెండో ప్రెగ్నెన్సీతోనైనా మెగాస్టార్ చిరకాల కోరిక తీరి, మెగా కుటుంబంలోకి ఓ మనవడు అడుగుపెడతాడేమోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.








