ఓ పాఠశాలలో అసిస్టెంట్ టీచర్ (Assistant Teacher), అంగన్వాడీ వర్కర్ (Anganwadi Worker) మధ్య ఘోరమైన ఘర్షణ చోటుచేసుకుంది. స్కూల్ ప్రాంగణంలో మాటామాటా పెరిగి, చివరికి వారు పరస్పరం జుట్టు పట్టుకుని కిందపడి కొట్టుకున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని మథుర (Mathura) లో చోటు చేసుకుంది. అసిస్టెంట్ టీచర్ ప్రీతి తివారీ (Preeti Tiwari), అంగన్శాడీ కార్యకర్త చంద్రావతి (Chandravati) మధ్య ఒక విషయంలో వాగ్వాదం ప్రారంభమైంది. అది కాస్త క్రమంగా తీవ్రంగా మారింది. కొద్దిసేపటికే ఇద్దరూ ఒకరినొకరు గట్టిగా తోసుకుంటూ, బలంగా కొట్టుకోవడం మొదలు పెట్టారు. ఇది అక్కడి విద్యార్థులు, సిబ్బందిని ఆశ్చర్యంలో ముంచెత్తింది.
సంఘటనపై స్కూల్ సిబ్బంది (School Staff) వెంటనే స్పందించి వారిని విడదీశారు. అయితే ఈ గొడవకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ప్రస్తుతం విద్యాశాఖ అధికారులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు.
#मथुरा: आंगनवाड़ी सहायिका और शिक्षिका के बीच मारपीट, बच्चों के सामने हुआ हंगामा, वीडियो वायरल।
— UttarPradesh.ORG News (@WeUttarPradesh) March 27, 2025
मथुरा जनपद के छाता क्षेत्र में एक आंगनवाड़ी केंद्र पर हैरान कर देने वाली घटना सामने आई, जहां आंगनवाड़ी सहायिका और शिक्षिका आपस में भिड़ गईं। दोनों के बीच जमकर गाली-गलौज और मारपीट हुई,… pic.twitter.com/duhGFOLeay