సినీ అభిమానులని ఆకర్షిస్తున్న నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సెలబ్రిటీ టాక్ షో ‘అన్‌స్టాపబుల్’ ఈసారి కొత్త రసకందాయంతో ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఇప్పటికే 4వ సీజన్‌లో హీరోలు వెంకటేశ్, సూర్యలతో పాటు పలు ప్రముఖుల హాజరయ్యారు. ఈ కార్యక్రమం ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ ‘ఆహా’లో ప్రసారం అవుతోంది.
‘గేమ్ ఛేంజర్’ ప్రమోషన్ కోసం రామ్ చరణ్?
ఈ సీజన్‌లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా బాలయ్య షోలో కనిపించనున్నారని సమాచారం. రామ్ చరణ్ తన నూతన చిత్రం ‘గేమ్ ఛేంజర్’ ప్రమోషన్లలో భాగంగా డిసెంబర్ 31న ఈ టాక్ షోలో పాల్గొనబోతున్నట్లు ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఎపిసోడ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.