చరిత్ర సృష్టించిన క్రికెట‌ర్ గొంగడి త్రిష

చరిత్ర సృష్టించిన క్రికెట‌ర్ గొంగడి త్రిష

తెలంగాణ రాష్ట్రం భద్రాచలం ప్రాంతానికి చెందిన గొంగడి త్రిష (Gongadi Trisha) అండర్-19 మహిళల టీ20 వరల్డ్ కప్‌లో చరిత్ర సృష్టించింది. మలేషియాలోని కౌలాలంపూర్‌లో జరిగిన మ్యాచ్‌లో, తొలి సెంచరీ కొట్టిన బ్యాటర్‌గా ప్రపంచ రికార్డు సాధించింది. త్రిష 59 బంతుల్లో 13 ఫోర్లు, 4 సిక్సులతో అజేయంగా 110 పరుగులు చేసింది. బౌలింగ్‌లోనూ మూడు వికెట్లు ప‌డ‌గొట్టి అద్భుత‌మైన ఆట‌తీరును క‌న‌బ‌ర్చింది. సూపర్ సిక్స్‌లో భాగంగా రెండో మ్యాచ్‌లో త్రిష త‌న ఆటతీరుతో చూపిన ధైర్యం, నైపుణ్యం అందరినీ ఆకట్టుకున్నాయి. 110 పరుగులతో పాటు, టీమ్‌ని విజయానికి నడిపించే విధంగా ఆమె కృషి చేసింది. దీంతో క్రీడాభిమానులు గొంగ‌డి త్రిష‌ను అభినందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment