అమ్మాయిల జోరు.. అండర్-19 టీ20 ప్రపంచకప్ మ‌న‌దే

అమ్మాయిల జోరు.. అండర్-19 టీ20 ప్రపంచకప్ మ‌న‌దే

భారత అండర్-19 మహిళల క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. టీ20 ప్రపంచకప్ ఫైనల్లో సౌతాఫ్రికాపై ఘన విజయం సాధించి విశ్వవిజేతగా అవతరించింది. ఫైనల్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా, భారత బౌలర్ల ధాటికి కేవలం 82 పరుగులకే ఆలౌట్ అయింది. భారత బౌలింగ్ దళం అద్భుత ప్రదర్శన కనబరిచింది, ముఖ్యంగా తెలుగమ్మాయి త్రిష మూడు కీలక వికెట్లు తీసి మ్యాచ్‌లో తన ప్రభావాన్ని చూపించారు. బ్యాటింగ్‌లోనూ ఆమె మెరుగైన ప్రదర్శన చేసి జట్టును గెలుపు బాట పట్టించారు. ఈ ఘన విజయం భారత మహిళల క్రికెట్ పురోగతికి మైలురాయి.

మొదట బౌలింగ్ లో మూడు వికెట్ల పడగొట్టిన ఈ తెలుగు తేజం ఆ తర్వాత బ్యాటింగ్ లోనూ సత్తా చాటింది. 44 పరుగులతో నాటౌట్ గా నిలిచి భారత విజయంలో కీలక పాత్ర పోషించింది. దక్షిణాఫ్రికా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. భారత బౌలర్ల ముందు దక్షిణాఫ్రికా బ్యాటర్లు పెవిలియ‌న్ బాట ప‌ట్టారు. టీమిండియా తరఫున అత్యధికంగా గొంగడి త్రిష 3 వికెట్లు తీయగా, పరుణికా సిసోడియా, ఆయుషి శుక్లా, వైష్ణవి శర్మ త‌లో రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు.

Join WhatsApp

Join Now

Leave a Comment