ఉక్రెయిన్ చీఫ్‌ జెలెన్ స్కీకి ట్రంప్ మరో షాక్

ఉక్రెయిన్ చీఫ్‌ జెలెన్ స్కీకి ట్రంప్ మరో షాక్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీకి వరుస షాక్‌లు ఇస్తున్నారు. తాజాగా, కీవ్‌కు నాటో (NATO) సభ్యత్వం ప్రాక్టికల్‌గా సాధ్యం కాదని తేల్చిచెప్పారు. ఇది రష్యా ప్రధాన డిమాండ్లలో ఒకటిగా ఉండటంతో, ఉక్రెయిన్ కోసం మరింత సంక్లిష్టమైన పరిస్థితి ఏర్పడింది. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ట్రంప్ దాదాపు 90 నిమిషాల పాటు ఫోన్‌లో మాట్లాడిన అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రష్యా ఆక్రమించిన భూభాగాన్ని తిరిగి పొందే అవకాశం ఉక్రెయిన్‌కు లేదని కూడా స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలతో క్రిమియా సహా ఇతర ఆక్రమిత ప్రాంతాలపై ఉక్రెయిన్ ఆశలు మరింత తగ్గిపోయాయి.

శాంతి చర్చల దిశగా మొదటి అడుగు?
ఉక్రెయిన్-రష్యా మధ్య శాంతి చర్చలు త్వరలో ప్రారంభమయ్యే అవకాశం ఉందని ట్రంప్ వెల్లడించారు. ఈ చర్చల కోసం సౌదీ అరేబియాలో తొలిసారి సమావేశం జరిగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. అయితే తేదీలు ఇంకా ఖరారు కాలేదని స్పష్టం చేశారు. ఈ చర్చల్లో సౌదీ యువరాజు కూడా పాల్గొనవచ్చని వెల్లడించారు.

ఇదిలా ఉండగా ట్రంప్ వ్యాఖ్యలపై స్పందించిన జెలెన్ స్కీ.. ఉక్రెయిన్‌లో నిజమైన శాంతిని తీసుకురావడం కోసం తమ చర్చలు సాగుతున్నాయని పేర్కొన్నారు. ఈ దిశగా దౌత్య, సైనిక, ఆర్థిక అంశాలపై చర్చించామని, ట్రంప్ స్వయంగా పుతిన్‌తో మాట్లాడిన విషయాన్ని ఆయన వెల్లడించినట్టు తెలిపారు. క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ మాట్లాడుతూ.. ట్రంప్‌ను రష్యా పర్యటనకు పుతిన్ ఆహ్వానించారని తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment