ఉక్రెయిన్ రాజకీయాల్లో (Ukraine Politics) భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. దేశ ప్రధానిగా వ్యవహరిస్తున్న డెనిస్ ష్మిహాల్ (Denys Shmyhal) తన పదవికి అధికారికంగా రాజీనామా (Resignation) చేశారు. మంగళవారం ఆయన తన రాజీనామా పత్రాన్ని సమర్పించగా, ఆ వెంటనే అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ (Volodymyr Zelenskyy) ప్రధానిగా కొత్త వ్యక్తిని నామినేట్ (Nominated) చేయడం సంచలనంగా మారింది.
యుద్ధవాతావరణంలో కీలక మార్పులు
ఉక్రెయిన్–రష్యా మధ్య యుద్ధం తీవ్రమవుతుండగా, అమెరికా మద్దతుతో ఉక్రెయిన్ భారీ యుద్ధ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త ఆర్థిక, సైనిక వ్యూహాలను ముందుకు తీసుకెళ్లేందుకు జెలెన్‌స్కీ తన మంత్రివర్గంలో మార్పులు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుత ఆర్థిక మంత్రి, ఉప ప్రధాని యులియా స్వైరిడెంకోను (Yulia Svyrydenko) ప్రధానిగా ప్రతిపాదించారు. ఆమె జెలెన్‌స్కీకి వ్యక్తిగతంగా ఎంతో సన్నిహితురాలే కాకుండా, అమెరికాతో ఉక్రెయిన్ మధ్య కీలక ఖనిజ ఒప్పందాల చర్చల్లోనూ ప్రధాన పాత్ర పోషించారు.
అంతర్జాతీయ వేదికలపై యులియాకు ఉన్న అనుభవం, పాశ్చాత్య దేశాలతో సంబంధాల నిర్వహణలో ఆమె చురుకైన పాత్రను జెలెన్‌స్కీ అధికంగా పరిగణిస్తున్నట్లు పార్లమెంటరీ వర్గాలు భావిస్తున్నాయి. పదవిని చేపట్టేందుకు అర్హత పూర్తి స్థాయిలో ఉంది అనే అభిప్రాయం పార్లమెంటులో వ్యక్తమవుతోంది.
ష్మిహాల్ భవిష్యత్ మార్గం?
2020 మార్చి నుంచి ప్రధానిగా ఉన్న డెనిస్ ష్మిహాల్, త్వరలో రక్షణ మంత్రిగా నియమితులయ్యే అవకాశముందని జెలెన్‌స్కీ వెల్లడించారు. యుద్ధ సమయంలో దేశ రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ఈ మార్పు అవసరమన్నదే ప్రభుత్వ నడకగా తెలుస్తోంది. ఈ వారంలోనే యులియా స్వైరిడెంకో నామినేషన్‌పై ఉక్రెయిన్ పార్లమెంటులో ఓటింగ్ జరగనుంది. ఇప్పటికే జెలెన్‌స్కీ, యులియా కలిసి రాబోయే ఆరు నెలల కార్యాచరణ ప్రణాళికపై చర్చలు పూర్తి చేసినట్లు సమాచారం.