2 ఏళ్లకే రూ. 250 కోట్ల అధిపతి.. ఆ స్టార్ దంపతుల బిడ్డ ఎవరో తెలుసా?

2 ఏళ్లకే రూ. 250 కోట్ల అధిపతి.. ఆ స్టార్ దంపతుల బిడ్డ ఎవరో తెలుసా?

తల్లిదండ్రులు (Parents) తమ బిడ్డల (Children’s) బంగారు భవిష్యత్ (Bright Future) కోసం డబ్బులు కూడబెడుతుంటారు. చదువులు, కెరీర్, పెళ్లి వంటి అవసరాలకు ఈ డబ్బు ఉపయోగపడుతుందని పైసా పైసా పోగు చేస్తారు. సెలబ్రిటీలు కూడా ఇందుకు అతీతులు కాదు. తమ సంపాదనను పిల్లల భవిష్యత్తు కోసమే వెచ్చిస్తారు. ఇటీవల, సినిమా ఇండస్ట్రీకి చెందిన ఓ ప్రముఖ జంట తమ కూతురికి వందల కోట్ల రూపాయల విలువైన ఆస్తిని బహుమతిగా ఇచ్చింది. పాప పుట్టిన వెంటనే ఆమె పేరు మీద ఏకంగా కోట్లకు విలువైన ఆస్తిని రిజిస్ట్రేషన్ చేయించి, ఆమెను అత్యంత ధనవంతురాలైన స్టార్ కిడ్‌గా మార్చారు. ప్రస్తుతం ఈ విషయం సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది.

ఈ ఘనత సాధించినది మరెవరో కాదు, బాలీవుడ్ లవ్లీ కపుల్ అలియా భట్ (Alia Bhatt) మరియు రణబీర్ కపూర్ (Ranbir Kapoor). వీరు తమ కూతురు రాహా కపూర్ (Raha Kapoor) పేరు మీద సుమారు రూ. 250 కోట్ల విలువ చేసే (₹250 Crores Worth) భవనాన్ని రిజిస్టర్ (Building Registered) చేయించారు. అంతేకాదు, ఆ ఆస్తికి సంరక్షకురాలిగా రణబీర్ కపూర్ తల్లి, ప్రముఖ నటి నీతూ కపూర్ (Neetu Kapoor) పేరును రిజిస్టర్ చేయించారు.

ఈ ఇల్లు రణబీర్ కపూర్‌కు వారసత్వంగా వచ్చింది. రణబీర్ తాత రాజ్ కపూర్ ఈ ఇంటిని కొనుగోలు చేయగా, ఆ తర్వాత రిషి కపూర్ అందులోనే నివసించారు. ఇప్పుడు ఈ ఆస్తి రణబీర్ కపూర్ చేతికి వచ్చింది. ప్రస్తుతం ఈ ఇంటిని రీమోడలింగ్ చేయించి, పాత ఇంటి గుర్తులు చెరిగిపోకుండా ఆరు అంతస్తుల విలాసవంతమైన భవనాన్ని నిర్మించారు. రణబీర్ ఈ ఇంటిని చాలా సెంటిమెంట్‌గా భావిస్తున్నాడు. పైగా, కూతురు పుట్టిన తర్వాత తన ప్రొఫెషనల్ లైఫ్‌లో బాగా కలిసి వచ్చిందని ఆయన నమ్ముతున్నారు. అందుకే దాదాపు రూ. 250 కోట్లకు పైగా ఉన్న ఆ భవనాన్ని కూతురు రాహా పేరుతో రిజిస్ట్రేషన్ చేపించాడు. త్వరలోనే అలియా భట్ కుటుంబం ఈ కొత్త ఇంట్లోకి అడుగుపెట్టనుంది. ఈ దీపావళిని తమ కూతురితో కలిసి కొత్త ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకోవాలని రణబీర్ ప్లాన్ చేస్తున్నాడట.

Join WhatsApp

Join Now

Leave a Comment