నంద్యాల చాపిరేవులో గ్యాస్ సిలిండర్ పేలి ఇద్ద‌రు మృతి

నంద్యాల చాపిరేవులో గ్యాస్ సిలిండర్ పేలి ఇద్ద‌రు మృతి

నంద్యాల జిల్లాలోని చాపిరేవుల గ్రామంలో ఈరోజు ఉదయం భయానక ఘటన చోటుచేసుకుంది. ఒక ఇంట్లో వంట చేస్తుండగా, ప్రమాదవశాత్తూ గ్యాస్‌ సిలిండర్‌ పేలింది. ఈ పేలుడుతో ఇల్లు పూర్తిగా కుప్పకూలిపోయి, ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.

ఘటన వివరాలు
చాపిరేవుల గ్రామంలో గ్యాస్ సిలిండ‌ర్ పేలుడు ధాటికి చుట్టుపక్కల నివాసాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదంలో వెంకటమ్మ (62), దినేష్‌ (10) అనే ఇద్దరు మరణించారు. మరో పది మందికి పైగా గాయాలు కాగా, వారిని దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. గ్యాస్ స్టౌవ్‌ ఆన్‌లో ఉండటమే ప్ర‌మాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి, ప్రమాదానికి గ‌ల స‌మ‌గ్ర వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Join WhatsApp

Join Now

Leave a Comment