తెలంగాణ‌లో ఇద్దరు ఏపీ డీఎస్పీలు మృతి

తెలంగాణ‌లో ఇద్దరు ఏపీ డీఎస్పీలు మృతి

జోరున వ‌ర్షం (Heavily Rain), రోడ్ల‌న్నీ(Roads) జ‌ల‌మ‌యం ప‌ని నిమిత్తం హైద‌రాబాద్‌ (Hyderabad)కు వెళ్తున్న ఏపీ పోలీస్ (AP Police) ఉన్న‌తాధికారుల కారు రోడ్డు ప్ర‌మాదానికి గురైంది. యాదాద్రి (Yadadri) భువనగిరి జిల్లా (Bhuvanagiri District), చౌటుప్పల్ మండలం, భైతాపురం (Bhaitapuram) వద్ద జ‌రిగిన ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident)లో ఏపీకి చెందిన ఇద్ద‌రు ఇంటెలిజెన్స్ డీఎస్పీలు (Intelligence DSPs) దుర్మ‌ర‌ణం చెందారు (Died). స్కార్పియో వాహనం లారీని ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు.

పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం, స్కార్పియో వాహనం అదుపుతప్పి ముందున్న డివైడర్‌ను ఢీకొట్టి, అనంతరం ఎదురుగా వస్తున్న లారీని బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటన ఏపీ నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా చోటుచేసుకుంది. మృతుల్లో ఇద్దరు ఏపీ డీఎస్పీలు శాంతారావు (Shanta Rao), మేక చక్రధర్ (Meka Chakradhar) ఉన్నారని గుర్తించారు. వీరిద్దరూ ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు.

ఈ ప్రమాదంలో అడిషనల్ ఎస్పీ ప్రసాద్‌కి తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవర్ నర్సింగరావు పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment