TVK విజయ్ పోటీ ఖరారు..

TVK విజయ్ పోటీ ఖరారు..

 రాబోవు తమిళనాడు (Tamil Nadu) ఎన్నికల్లో తమిళగ వెట్ర కళగం (TVK) పార్టీ కీలకంగా మారనుంది. ఇప్పటికే తన సినిమాలతో ప్రేక్షకులను అలరించిన విజయ్ (Vijay) రాజకీయంలోని అడుగు పెట్టి టీవీకే పార్టీని స్థాపించారు. స్టాలిన్ ప్రభుత్వాన్ని గద్దె దింపడమే లక్ష్యంగా పని చేస్తున్నారు. అయితే.. తాజాగా తమిళనాడు ఎన్నికల్లో పోటీకి రోడ్ మ్యాప్ సిద్ధం చేసుకుంటున్నారు.

 టీవీకే చీఫ్ విజయ్.. నార్త్ చెన్నై (North Chennai) నుంచి పోటీకి విజయ్ రెడీ అయ్యారు.. ఉత్తర చెన్నైలోని ఒక నియోజకవర్గం నుంచి విజయ్ పోటీ చేస్తారన్న టీవీకే ప్రధాన కార్యదర్శి స్పష్టం చేశారు.. నార్త్ చెన్నై వెనుకబాటుకు డీఎంకేనే (DMK) కారణమంటున్న విజయ్ పార్టీ ఇప్పటికే ఆరోపిస్తోంది.. నార్త్ చెన్నైని స్టాలిన్ (M.K. Stalin) ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని అక్కడి నుంచే తాము పోటీ చేయాలనుకుంటున్నట్లు పార్టీ నిర్ణయించుకుంది.

ఇదిలా ఉండగా.. ఇటీవల విజయ్ పొత్తు అంశంపై క్లారిటీ ఇచ్చాడు. అధికార డీఎంకేను కూల్చడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నామని స్పష్ట చేశారు. అయితే.. రానున్న ఎన్నికల్లో రెండు ప్రధాన జాతీయ కూటములైన ఎన్డీయే, యూపీయేతో పొత్తు పెట్టుకోబోమని, స్వతంత్రంగానే ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. తమ పార్టీ రాష్ట్రంలో ప్రధాన రాజకీయ శక్తిగా అవతరిస్తుందని, సంప్రదాయ పార్టీలైన రెండు వ్యతిరేక పక్షాలకు ప్రత్యామ్నాయంగా ఆవిర్భవిస్తుందని చెప్పారు. ఎన్నికల తర్వాత కూడా తమ పార్టీ ఏ కూటమిలో చేరబోదని స్పష్టంచేశారు. ఒంటరిగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తంచేశారు. ఈ ప్రకటనతో తమిళనాడు రాజకీయం మరింత రసవత్తరంగా మారింది.

Join WhatsApp

Join Now

Leave a Comment