టీటీడీ (TTD) గోశాలలో(Gosala) గోవుల (Cows) మృతి (Deathsపై భారతీయ జనతా పార్టీ (BJP) సీనియర్ లీడర్,కేంద్ర మాజీ మంత్రి (Former Union Minister) సుబ్రహ్మణ్యస్వామి (Subramanian Swamy) తీవ్రంగా స్పందించారు. తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి (TTD Board of Trustees) చైర్మన్ (Chairman) బీఆర్ నాయుడు (B.R. Naidu) వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ సంచలన కామెంట్స్ చేశారు. గోవుల మృతిపై త్వరలో కోర్టు (Court)ను ఆశ్రయిస్తానని ప్రకటించారు. గోవుల మృతిని వెలికితీసిన భూమన కరుణాకర్‌రెడ్డి (Bhoomana Karunakar Reddy)పై కేసులు పెట్టడాన్ని సుబ్రహ్మణ్యస్వామి తప్పుబడుతూ.. చైర్మన్ బీఆర్ నాయుడుపై కీలక వ్యాఖ్యలు చేశారు.
చనిపోయిన గోవుల కళేబరాలను (Carcasses Of Dead Cows) రెస్టారెంట్లకు (Restaurants) పంపుతున్నారా..? అని బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి సంచలన ఆరోపణలు చేశారు. గోవుల మృతిపై దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. వందల సంఖ్యలో గోవులు చనిపోవడం వెనుక కుట్ర ఉందని, టీటీడీ (TTD)లో వ్యాపార ధోరణితో (Commercial Mindset) చూడడం వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయా అని అనుమానం వ్యక్తం చేశారు. ప్రస్తుత టీటీడీ బోర్డు పాలన అధ్వాన్నంగా తయారైందని, గతంలో చైర్మన్ అందరికీ అందుబాటులో ఉండేవారని, ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేవారని చెప్పారు.
వయసు మళ్లిన మనుషుల్లాగే.. ఆవులు చనిపోతున్నాయని టీటీడీ చైర్మన్ బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని సుబ్రహ్మణ్యస్వామి అన్నారు. ఈ వ్యాఖ్యలు చేసిన వ్యక్తి చనిపోతే వయస్సు మీదపడి చనిపోయారని వదిలేస్తారా..? ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించరా..? అని ప్రశ్నించారు. సరైన వైద్యం అందించకుండా గోవులను వదిలేస్తున్నారని, సరైన ఆలనా పాలనా లేకపోవడం వల్లే గోవులకు ఈ పరిస్థితి దాపురించిందన్నారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును వెంటనే బర్తరఫ్ (Remove) చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు(CM-Chandrababu)ను బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి డిమాండ్ (Demand) చేశారు. రాజ్యాంగంలో గోవుకు అత్యున్నత స్థానం కల్పించారని, గోవు కేవలం జంతువు మాత్రమే కాదు.. హిందువుల ఆరాధ్య దైవమని గుర్తుచేశారు.
“బ్రాహ్మణులపై మూత్రం పోస్తా” – అనురాగ్ కశ్యప్ వివాదాస్పద వ్యాఖ్య