అమెరికా అధ్యక్షుడు (America President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి తన వివాదాస్పద వ్యాఖ్యతో వార్తల్లోకి ఎక్కారు. అమెరికాలో జరిగిన ఏఐ సమ్మిట్ (AI Summit) సందర్భంగా ట్రంప్, గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి ప్రముఖ టెక్ కంపెనీలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇండియన్స్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గూగుల్ (Google), మైక్రోసాఫ్ట్ (Microsoft) వంటి దిగ్గజ టెక్ కంపెనీల్లో ఇండియన్స్‌కు ఉద్యోగాలు (Indians Jobs) ఇవ్వొద్దని హెచ్చరించారు. విదేశీయులకు ఉద్యోగాలు ఇవ్వడం వల్ల అమెరికన్ పౌరులు వేల సంఖ్యలో ఉద్యోగాలు కోల్పోతున్నారు అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
“గ్లోబల్ మైండ్‌సెట్ వల్ల అమెరికన్లకు నష్టం”
“గ్లోబల్ మైండ్‌సెట్ (Global Mindset) అనే మోహంలో పడి కొన్ని కంపెనీలు అమెరికాలో సంపాదించి, విదేశాల్లో పెట్టుబడులు పెడుతున్నాయి. అమెరికన్ టాలెంట్‌ను పక్కన పెట్టి ఇండియన్ వర్కర్లను తీసుకుంటున్నారు. ఇది ఆమోదయోగ్యం కాదు. నేను దీన్ని అడ్డుకుంటా” అంటూ హెచ్చరించారు.
“అమెరికన్లకే ప్రాధాన్యం”
“అమెరికాలో ఉద్యోగాలు అమెరికన్లకే ఉండాలి. విదేశీయులకే ఎక్కువ అవకాశాలు ఇవ్వడం వల్ల దేశ ఆర్థిక స్థిరత దెబ్బతింటుంది. ముఖ్యంగా ఇండియా (నుంచి వచ్చే టెక్ ఉద్యోగులు స్థానిక ఉద్యోగాలపై ప్రభావం చూపుతున్నారు. నా పాలనలో ఇది జరగదు” అని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం అమెరికా–ఇండియా టెక్ సంబంధాలపై చర్చకు దారితీస్తున్నాయి.