అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్ల్ షాక్ ప్రభావం నేరుగా భారతీయ స్టాక్ మార్కెట్లపై పడింది. ఈ ఉదయం నుంచే బలహీనంగా ప్రారంభమైన మార్కెట్లు, మధ్యాహ్నానికి భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 500 పాయింట్లు పడిపడి 80,126 వద్ద, నిఫ్టీ 151 పాయింట్లు క్షీణించి 24,444 వద్ద ట్రేడవుతున్నాయి.
లాభాల వైపు టైటాన్, NTPC, బజాజ్ ఫైనాన్స్, ITC షేర్లు సానుకూల ధోరణి చూపుతున్నాయి. అయితే భారతీ ఎయిర్టెల్, అదానీ ఎంటర్ప్రైజెస్, శ్రీరామ్ ఫైనాన్స్, ఇండస్‌ఇండ్ బ్యాంక్ షేర్లు గణనీయంగా నష్టపోతున్నాయి. విశ్లేషకుల ప్రకారం, గ్లోబల్ ట్రేడ్ ఉద్రిక్తతలతో పాటు టారిఫ్‌ల విధింపు మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీస్తున్నది.







