భార‌త్‌-పాక్ యుద్ధంపై మాట మార్చిన ట్రంప్

భార‌త్‌-పాక్ యుద్ధంపై మాట మార్చిన ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఇటీవల ఇండియా-పాకిస్తాన్ (India-Pakistan) మధ్య ఉద్రిక్తతలపై తన వైఖరిని మార్చుకున్నట్లు కనిపిస్తోంది. మొద‌ట రాత్రంతా సుదీర్ఘ చ‌ర్చ‌లు జ‌రిపి ఇరు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపేశాన‌ని ఆర్భాటంగా ప్రకటించుకున్న ట్రంప్, తాజాగా మాట మార్చారు. తాను ‘‘నేను భారత్ – పాక్ మధ్య యుద్ధాన్ని ఆప‌లేదు కానీ, ఆ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించాను’’ అన్నారు.

ఇండియా-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న సమయంలో ట్రంప్ తనను తాను శాంతి మధ్యవర్తిగా ప్రకటించుకున్నారు. ‘‘భారత్ – పాకిస్తాన్‌ మధ్య జ‌రుగుతున్న‌ యుద్దాన్ని నేను ఆపాను. రెండు దేశాలు నా మాట విని యుద్దాన్ని ఆపేశాయి. నా మధ్యవర్తిత్వంతో అణు విధ్వంసాన్ని ఆపేశాను’’ అని ట్రంప్ గొప్ప‌గా ప్ర‌క‌టించుకున్నాడు.

ఖతార్‌(Qatar)లోని అల్ ఉదీద్ వైమానిక స్థావరంలో (Al Udeid Air Base) ఆర్మీని ఉద్దేశించి అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్‌ ట్రంప్ మాట్లాడుతూ.. గ‌తంలో చేసిన ప్ర‌క‌ట‌న‌కు విరుద్ధంగా వ్యాఖ్య‌లు చేశారు. రెండు దేశాల మ‌ధ్య కాల్పుల విర‌మ‌ణ‌కు సాయం మాత్ర‌మే చేశాన‌ని ప్ర‌క‌టించుకున్నారు. ట్రంప్ ఈ మాట మార్పు వెనుక అనేక కారణాలు ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. మొదటిగా, అమెరికా ఆర్థిక, రాజకీయ లాభాల కోసం ట్రంప్ ఈ వైఖరిని తీసుకున్నారని కొందరు అనుమానిస్తున్నారు. ట్రంప్ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. కొంద‌రు నీ వ్యాఖ్య‌ల‌ను నువ్వే ఉప‌స‌హంరించుకున్నందుకు థ్యాంక్స్ చెబుతుండ‌గా, గుడ్ డెవ‌ల‌ప్‌మెంట్ అంటూ సెటైర్లు వేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment