భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖతార్ (Qatar) పర్యటనలో భాగంగా పలు ప్రముఖ కంపెనీల సీఈవోలతో సమావేశమైన ట్రంప్, ఆపిల్ సీఈవో టిమ్ కుక్ (Tim Cook)తో సంభాషణలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో ఆపిల్ కంపెనీలు పెట్టాల్సిన అవసరం లేదని, వాటిని అమెరికాలోనే ఏర్పాటు చేయాలని సూచించారు.
భారతదేశం తన అవసరాలను తానే నెరవేర్చగలదని పేర్కొన్న ట్రంప్ “వారు బాగా పనిచేస్తున్నారు, కానీ మనం మన దేశంలో ఉత్పత్తి పెంచాలి” అని అన్నారు. భారత్ ప్రపంచంలోనే అత్యధిక సుంకాలు (import tariffs) విధించే దేశాలలో ఒకటిగా పేర్కొంటూ “భారతదేశంలో ఉత్పత్తులు అమ్మడం చాలా కష్టం” అని అభిప్రాయపడ్డారు.
అమెరికా నుంచి భారత్‌కు వెళ్లే వస్తువులపై సుంకాలు లేకుండా డీల్ ఆఫర్ చేసిందని ట్రంప్ వెల్లడించారు. అయినప్పటికీ, ఆపిల్ ఉత్పత్తులు భారత్‌లో తయారు చేయాల్సిన అవసరం లేదని తన అభిప్రాయాన్ని మరోసారి స్పష్టం చేశారు. కాగా, ఇప్పటికే భారత్‌లో మూడు యాపిల్ ప్లాంట్లు ఉన్నాయి. వాటిలో రెండు తమిళనాడు (Tamil Nadu)లో, మరోటి కర్ణాటక (Karnataka)లో ఉన్నాయి. తాజాగా మరిన్ని ప్లాంట్లు ఏర్పాటు చేయాలన్న ఆపిల్ యోచనల నేపథ్యంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చకు కేంద్రబిందువుగా మారాయి.
ఈ వ్యాఖ్యల వల్ల ఆపిల్ సంస్థ భారత మార్కెట్‌పై తీసుకునే నిర్ణయాలపై ప్రభావం పడే అవకాశం ఉంది. అమెరికా–భారత్ వాణిజ్య సంబంధాల్లో ఈ అభిప్రాయాలు ఎంత మేర ప్రభావం చూపిస్తాయో చూడాల్సి ఉంది.








