అమెరికా (America), ఇరాన్ (Iran) మధ్య గత మూడు వారాలుగా జరుగుతున్న యుద్ధంలో (War) ఒక కీలకమైన మార్పు చోటుచేసుకుంది. ఈ రెండు దేశాల మధ్య శాంతి చర్చలు మొదలయ్యాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) స్వయంగా ప్రకటించారు. గత రెండు రోజులుగా అమెరికా , ఇరాన్ ప్రతినిధుల మధ్య చర్చలు జరిగాయని ట్రంప్ తన సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ప్రస్తుతానికి ఐదు రోజుల పాటు ఈ దాడులను వాయిదా వేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు.
ఇంధన వసతులపై (Energy Infrastructure) దాడులు, చర్చలు అంటూ ట్రంప్ ప్రకటనపై ఇరాన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ట్రంప్ తాజా పోస్ట్‌పై స్పందిస్తూ, ఇరాన్ ప్రతీకార చర్యలకు పాల్పడుతుందనే భయంతోనే ట్రంప్ వెనక్కి తగ్గారని ఇరాన్ పేర్కొంది. టెహ్రాన్ (Tehran) గట్టి హెచ్చరికల నేపథ్యంలోనే ఇరాన్ ఇంధన మౌలిక సదుపాయాలపై దాడి చేసే ప్రణాళికల నుండి డొనాల్డ్ ట్రంప్ వెనక్కి తగ్గారని కాబూల్‌లోని ఇరాన్ రాయబార కార్యాలయం తెలిపింది.మరోవైపు అసలు అమెరికా ఎలాంటి చర్చలు జరగలేదని ఇరాన్ ప్రకటించడం గమనార్హం.








