డొనాల్డ్ ట్రంప్ ఆహ్వానం.. చైనా అధ్యక్షుడు హాజర‌వుతారా?

డొనాల్డ్ ట్రంప్ ఆహ్వానం.. చైనా అధ్యక్షుడు హాజర‌వుతారా?

అమెరికా అధ్యక్షుడిగా రెండవసారి ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ తన జనవరి 20 ప్రమాణస్వీకారానికి చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ను ఆహ్వానించారు. ఈ విషయాన్ని CBS న్యూస్ వివ‌రించింది. అధ్య‌క్ష ఎన్నికల అనంతరం నవంబర్ మాసంలోనే ట్రంప్ ఈ ఆహ్వానం పంపినట్లు తెలిపింది. అయితే, షీ జిన్‌పింగ్ ఈ ఆహ్వానాన్ని స్వీకరించారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.

వాషింగ్టన్‌లోని చైనా రాయబార కార్యాలయం ఈ విషయం గురించి ఇంకా స్పందించలేదు. జనవరి నెలలో క్యాపిటల్ హిల్‌లో జరిగే డొనాల్డ్ ట్రంప్‌ ప్రమాణస్వీకార వేడుకలో ప్రపంచంలోని పలువురు ప్రముఖుల‌ను ర‌ప్పించేందుకు ట్రంప్ టీమ్ ప్రయత్నిస్తోంది.

ఇంకా నిర్ణయంలోనే హంగేరీ ప్రధాని
హంగేరీ ప్రధానమంత్రి విక్టర్ ఒర్బన్ ట్రంప్‌తో సన్నిహితుడు. ఇటీవల మారా-లాగోలో ఆయనను కలిశారు. ఒర్బన్ ట్రంప్ ప్ర‌మాణ‌స్వీకార కార్యక్రమానికి హాజరుకాబోతున్నారా అన్నదిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని CBS న్యూస్ తెలిపింది.

ట్రంప్ ట్రాన్సిషన్ టీమ్ ప్రతినిధి కెరోలైన్ లేవిట్ మాట్లాడుతూ.. “ప్రపంచ నేతలు ట్రంప్‌ను కలుసుకోవడానికి క్యూ కడుతున్నారు. వారు ట్రంప్ తిరిగి అధికారంలోకి వచ్చి ప్రపంచ శాంతిని పునరుద్ధరిస్తారని న‌మ్ముతున్నార‌ని” వ్యాఖ్యానించారు.

చైనా-USA సంబంధాలపై ట్రంప్ కఠిన వైఖరి
ట్రంప్ ఇటీవల చైనాతో సంబంధాలపై మరింత కఠినంగా స్పందించారు. చైనా నుంచి దిగుమతయ్యే వస్తువులపై టారిఫ్‌లు పెంచుతామని హెచ్చరించారు. అదేవిధంగా జనవరి 19 నాటికి టిక్‌టాక్ యాజమాన్యాన్ని US కంపెనీకి విక్రయించకపోతే, యాప్‌పై నిషేధం అమలు చేస్తామని తెలిపారు. నిషేధం అంశంపై టిక్‌టాక్ కోర్టులో పోరాడుతుంది.

పునరాగమనం
2024 అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్, డెమోక్రాటిక్ అభ్యర్థి కమల హారిస్‌ను ఓడించారు. ట్రంప్ 2016-2020 మధ్య తన మొదటి అధ్యక్ష పదవీకాలాన్ని దిగ్విజ‌యంగా పూర్తిచేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment