అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన హాట్ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. “నువ్వు అందంగా ఉన్నావు… అందుకే నీ భర్తను నియమించుకున్నాను” అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారి తీశాయి. అమెరికా అంతర్గత కార్యదర్శిగా డగ్ బెర్గర్‌ను నియమించిన సందర్భంగా ఓవల్ ఆఫీస్‌లో మాట్లాడిన ట్రంప్, బెర్గర్ భార్య కేథరీన్ అందాన్ని ప్రస్తావిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆమె గుర్రపు స్వారీ చేస్తున్న వీడియో చూసి ముగ్ధుడినయ్యానని, ఆమె ఎవరో తెలుసుకున్నాకే ఆమె భర్తను నియమించాలనే నిర్ణయం తీసుకున్నానని చెప్పడం చర్చనీయాంశంగా మారింది. భార్యాభర్తలు పక్కనే ఉన్నప్పుడే ఈ వ్యాఖ్యలు చేయడం మరింత హీట్ పెంచింది.
అయితే అదే సమయంలో ట్రంప్, డగ్ బెర్గర్ పనితీరును కూడా ప్రశంసించారు. విజయవంతమైన వ్యాపారవేత్తగా, ఉత్తర డకోటా గవర్నర్‌గా రెండు సార్లు సేవలందించారని, ఆ ప్రయాణంలో కేథరీన్ కూడా ఆయనకు అండగా నిలిచారని పేర్కొన్నారు.
“కేథరీన్ జంట అద్భుతం” అంటూ వ్యాఖ్యానించిన ట్రంప్ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ వ్యాఖ్యలను కొందరు అసభ్యంగా, అవమానకరంగా విమర్శిస్తుంటే… మరికొందరు మాత్రం ట్రంప్ స్టైల్ అంతే అంటూ మద్దతుగా మాట్లాడుతున్నారు. దీంతో మరోసారి ట్రంప్ కామెంట్స్ అమెరికా రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.










