ట్రంప్ సంచలన నిర్ణయం.. అమెరికా విద్యాశాఖ రద్దు!

ట్రంప్ సంచలన నిర్ణయం.. అమెరికా విద్యాశాఖ రద్దు!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయంతో వార్త‌ల్లోకి ఎక్కారు. తాజాగా, ఆయన సమాఖ్య విద్యాశాఖను రద్దు చేస్తూ ఉత్తర్వులపై సంతకం చేశారు. వైట్ హౌస్‌లో జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో పాఠశాల పిల్లల సమక్షంలో ఈ నిర్ణయాన్ని ప్రకటించిన ట్రంప్, ఆర్డర్ కాపీని పైకెత్తి చూపుతూ నవ్వారు.

విద్యాశాఖను ట్రంప్ ‘ఉదారవాద భావజాలంతో కలుషితం’ అయిన విభాగంగా అభివర్ణించారు. విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు, ప్రభుత్వ ఖర్చులను తగ్గించేందుకు ఈ చర్య తీసుకున్నట్లు వివరించారు. అయితే, విద్యాశాఖను పూర్తిగా మూసివేయలేమని, కొన్ని కీలక విధులను కొనసాగిస్తుందని వైట్ హౌస్ స్పష్టం చేసింది.

కానీ.. ఇది సాధ్యమేనా?
1979లో ఏర్పాటైన అమెరికా విద్యాశాఖను రద్దు చేయాలంటే కేవలం అధ్యక్షుడి ఉత్తర్వుతో సాధ్యం కాదు. దీనికి కాంగ్రెస్ ఆమోదం అవసరం. రిపబ్లికన్లు త్వరలో దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టనున్నారని సమాచారం. ట్రంప్ నిర్ణయంతో విద్యా వ్యవస్థపై ఏమేరకు ప్రభావం చూపనున్నారో చూడాలి.

Join WhatsApp

Join Now

Leave a Comment