అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) గురించి నెట్టింట ఓ సంచలన వార్త వైరల్‌గా మారింది. గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో “Trump Dead” అనే క్యాప్షన్‌తో పోస్టులు హల్‌చల్ చేస్తున్నాయి. ఈ వార్త పెద్ద ఆందోళనకు, గందరగోళానికి గురిచేస్తోంది. అనేక పోస్టులు వైరల్ అవుతుండటంతో గ్లోబల్‌గా హడావుడి మొదలైంది.
అయితే వాస్తవం ఏమిటంటే.. ఇవన్నీ కేవలం పుకార్లే అని స్పష్టం అయ్యింది. ట్రంప్ ఆరోగ్యం బాగాలేదన్న పుకార్లు, అలాగే అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ (JD Vance) చేసిన “భయంకరమైన విషాదం” అనే ట్వీట్ ఈ గాసిప్‌లకు కారణమయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయినప్పటికీ, వైట్ హౌస్ (White House) వర్గాలు ట్రంప్ క్షేమంగా ఉన్నారని స్పష్టంచేస్తూ ఆయన ఆరోగ్యంపై ఆందోళన తొలగించే ప్రయత్నం చేశాయి.
ఈ ట్రెండ్ వెనక అసలు కారణం ఏమిటో తెలియదు, కానీ ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారడం గమనార్హం. ట్రంప్‌కు క్రానిక్ వెనస్ ఇన్సఫిషియన్సీ (CVI) వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నాయని మునుపటి నివేదికలు వెల్లడించినప్పటికీ, ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉందని వైద్యులు పేర్కొన్నారు.








