కార్లోస్ అల్కరాజ్ (Carlos Alcaraz)-జానిక్ సిన్నర్ (Jannik Sinner) మధ్య జరిగిన ఫైనల్ (Final) టెన్నిస్ మ్యాచ్ (Tennis Match)ను చూసేందుకు ట్రంప్(Trump) ఆర్థర్ ఆషే స్టేడియానికి (Arthur Ashe Stadium) వచ్చారు. అయితే, భద్రతా కారణాల వల్ల మ్యాచ్ అరగంట ఆలస్యంగా మొదలైంది. ట్రంప్ రాక గురించి ముందుగా ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడం, హఠాత్తుగా ఆయన పెద్ద స్క్రీన్‌పై కనిపించడంతో అభిమానులు (Fans) ఆగ్రహం (Anger) వ్యక్తం చేశారు.
సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. ట్రంప్ రావడం వల్లే మ్యాచ్(Match) ఆలస్యమైందని (Delayed), ఇది అభిమానులకు అసౌకర్యం కలిగించిందని వారు ఆరోపించారు. సాధారణంగా ఇలాంటి కీలక వ్యక్తుల రాకను ముందుగా ప్రకటిస్తారు, కానీ ఈసారి ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం.
ఈ సంఘటనపై నెటిజన్లు మాట్లాడుతూ, ట్రంప్ రాకతో అభిమానులు ఎవరూ సంతోషంగా లేరని, ఇది టెన్నిస్ మ్యాచ్‌కి అనవసరమైన ఆటంకం కలిగించిందని వ్యాఖ్యానించారు.
