ఓ స్టార్ హీరోతో నటి త్రిష కృష్ణన్ (Trisha Krishnan) ప్రేమ (Love)లో ఉన్నారని కోలీవుడ్ (Kollywood)లో వదంతులు వ్యాపించాయి. సదరు హీరోతో కలిసి దిగిన ఫోటోను త్రిష సోషల్ మీడియాలో పంచుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం, అదే ఫోటోను ఆమె తల్లి షేర్ చేస్తూ హార్ట్ ఎమోజీని (Heart Emoji) జతచేయడం ఈ పుకార్లకు దారితీసింది. అయితే, ఈ వదంతులపై త్రిష పరోక్షంగా స్పందించింది. ఇన్స్టాగ్రామ్ (Instagram) వేదికగా ప్రేమ గురించి ఒక పోస్ట్(Post)ను షేర్ చేసింది. “పూర్తిగా ప్రేమలో మునిగిపోతే, అది కొందరిని తికమక చేస్తుంది” అని ఆమె అందులో పేర్కొంది.
పెళ్లి పుకార్లు, కెరీర్:
త్రిష పెళ్లి విషయంలో గతంలో కూడా పలుమార్లు పుకార్లు (rumors) వచ్చాయి. ప్రతిసారీ ఆమె వాటిని ఖండిస్తూనే ఉంది. తన దృష్టి ప్రస్తుతం నటనపైనే ఉందని, ఒకవేళ వివాహబంధంలోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకుంటే తప్పకుండా ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తానని గతంలో ఒక సందర్భంలో తెలిపింది.
సినిమా కెరీర్ ప్రారంభించి 20 ఏళ్లు దాటినా, త్రిష ఇప్పటికీ హీరోయిన్గా తన సత్తాను చాటుతోంది. ఈ ఏడాది ఇప్పటికే ‘ఐడెంటిటీ’, ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’, ‘విదాముయార్చి’ (పట్టుదల), ‘థగ్‌లైఫ్’ చిత్రాలతో ప్రేక్షకులను పలకరించింది. ప్రస్తుతం చిరంజీవి ‘విశ్వంభర’, సూర్య ‘కరుప్పు’ చిత్రాల్లో త్రిష హీరోయిన్గా నటిస్తోంది.